వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు
న్యూఢిల్లీ,మే 13: వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును ప్రకటించారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్థానంలో గౌతం గంభీర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. వైఎస్ కెప్టెన్‌గా సురేష్ రైనా, వికెట్ కీపర్‌గా పార్థీవ్ పటేల్‌ను ఎంపిక చేసారు. విరాట్ కోహ్లీ, యువరాజ్‌సింగ్, బద్రినాథ్, రోహిత్ శర్మ, హర్భజన్‌సింగ్, ఆర్ అశ్విన్, ప్రవీణ్ కుమార్, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటేల్, వినయ్ కుమార్, యూసఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, వ్రిద్ధిమాన్ సాహాలకు జట్టులో స్థానం లభించింది.
Comments