ఆఫ్రికా దేశాలకు భారత్ వరాలు
ఆడిస్ అబాబా,మే 25: : ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నూతన సహకారాత్మక సంఘీభావం చోటుచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. భారత్, ఆఫ్రికాలోని 15 దేశాలు పాల్గొన్న ‘ఆఫ్రికా- ఇండియా ఫోరం’ రెండో శిఖరాగ్ర సదస్సు ప్లీనరీలో మంగళవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆఫ్రికా దేశాలకు ఆయన పలు వరాలు ప్రకటించారు. మూడేళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునేలా 500 కోట్ల డాలర్ల రుణంతో పాటు ఆ దేశాల్లో మౌలిక వసతుల కల్పనకు, సామర్థ్య పెంపుదలకు సాధ్యమైనంత సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అంతేకాకుండా మరో 70 కోట్ల డాలర్లను కొత్త సంస్థల ఏర్పాటు, శిక్షణ అవసరాల కోసం.. మరో 30 కోట్ల డాలర్లను ఇథియో-జిబౌతి రైల్వేలైన్ నిర్మాణానికి అందజేయనున్నట్లు వెల్లడించారు. 2008లో న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి ‘ఆఫ్రికా- ఇండియా ఫోరం’ సదస్సులో ప్రధాని ప్రకటించిన 540 కోట్ల డాలర్ల రుణానికి ప్రస్తుతం ప్రకటించిన రుణ మొత్తం అదనం.
Comments