నాకౌట్‌కు చెన్నై
చెన్నై,మే 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నాకౌట్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో ఈ జట్టు 11 పరుగుల తేడాతో కొచ్చి టస్కర్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కొచ్చి 20 ఓవర్లలో ఐదు వికెట్లకే 141 పరుగులకు పరిమితమైంది.
Comments