కటకటాలలో కనిమొళి
న్యూఢిల్లీ,మే 20: 2జి స్పెక్ట్రమ్ కేసులో డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, కళైంజ్ఞర్ టివీ సిఇఓ శరత్ కుమార్ లను సిబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచడంతో 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 30న తదుపరి విచారణ జరుగుతుంది. వారిని తీహార్ జైలుకు తరలించారు. ఈ ఇద్దరికి బెయిలు ఇవ్వడానికి ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించడం తో వారిని అరెస్ట్ చేశారు.
Comments