అవిశ్వాసంపై బాబుకు జగన్ సవాల్
విజయనగరం,మే 26: సం క్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం ఇక ఎంత మాత్రం ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పేద ప్రజల పట్ల నిజంగా ప్రేమే ఉంటే ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతూ నోటీసులు ఇవ్వాలని , అవిశ్వాస తీర్మానానికి అవసరమైతే తమ వర్గం మద్దతు పలుకుతుందని జగన్ సవాల్ విసిరారు. విజయనగరం జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్ర సందర్భంగా రెండో రోజు బుధవారం ఆయన పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లో పర్యటించారు. ఎస్‌ఎస్‌ఆర్ పేట గ్రామంలో ఉణుకూరు అప్పారావు కుటుంబాన్ని ఓదార్చారు. మొయిద జంక్షన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.
Comments