తెలంగాణ పై త్వరలో అఖిలపక్ష సమావేశం: చిదంబరం
న్యూఢిల్లీ,మే 23: తెలంగాణపై కేంద్రం వైఖరిలో ఎటువంటి మార్పు లేదని కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలతో త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. భేటీకి తేదీలు ఇంకా ఖరారు కాలేదని విలేకరుల సమావేశంలో చిదంబరం తెలిపారు. కర్ణాటక గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజను వెనక్కు పిలిచే ప్రసక్తి లేదని చిదంబరం మరో ప్రశ్నకు సమధానంగా స్పష్టం చేశారు. భరద్వాజ తన విధులు నిర్వర్తించారని, ఆయన పంపిన నివేదికపై తామే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గవర్నర్ నివేదికలోని అంశాలు కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించేందుకు నిర్ణయం తీసుకునేలా లేవని ఆయన అన్నారు.
Comments