పట్టు వదలని నాగం
హైదరాబాద్ ,మే 22: ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా టీడీపీ తరఫున కేంద్రానికి లేఖ పంపేలా తెలంగాణలోని గ్రామ, మండల, జిల్లా పార్టీ కార్యవర్గాలు మహానాడు లోపు తీర్మానాలు చేయాలని లేదా చంద్రబాబుకు లేఖలు రాయాలని టీడీపీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి కోరారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణకు తాము అనుకూలమని లేఖ పంపిన ప్పటికీ.. ఆ కమిటీకి కాలం చెల్లిందని, మరోమారు అదే కాపీని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరానికి పంపాలని కోరుతూ అంతకుముందు చంద్రబాబుకు నాగం లేఖ రాశారు. ప్రణబ్ కమిటీకి లేఖ రాసిన తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ తెలంగాణకు వ్యతిరేకమనే సంకేతాలు ప్రజల్లో ఉన్నాయని, వాటిని తొలగించేందుకు మరోమారు లేఖ పంపాలని విజ్ఞప్తి చేశారు. తనకు పదవులపై ఆశలేదని, ప్రజలిచ్చిన ఎమ్మెల్యే పదవిని వారు ఆజ్ఞాపించినపుడు వదిలేసేందుకు సిద్ధమని చెప్పారు.
Comments