కోల్‌కతా కథ కంచికి...
ముంబై,మే 26: ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన రెండో ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం ముంబై 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఇక ముంబై ఫైనల్ చేరాలంటే శుక్రవారం బెంగళూరుతో జరిగే రెండో క్వాలిఫయర్‌లో నెగ్గాలి. ఇరు జట్ల మధ్య విజేత శనివారం జరిగే ఫైనల్లో చెన్నైను ఎదుర్కొంటుంది. టోర్నీ ఆరంభంలో చక్కటి విజయాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన గంభీర్ జట్టు చివరకు ఎలిమినేటర్ రౌండ్‌లోనే వెనుదిరిగింది.
Comments