మావోయిస్టుల మందుపాతరకు ఏడుగురు జవాన్లు మృతి
న్యూఢిల్లీ,మే 18: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లా బోరగొండ వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జవాన్లు వాహనంలో వెళుతుండగా మందుపాతర పేల్చి వేశారు. మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సుకుమా నుంచి జగదల్‌పూర్‌కు తరలిస్తున్నారు.
Comments