చైనాలో ఆంధ్రా విద్యార్థి మృతి
అనపర్తి,మే 20: వైద్య విద్య చదివేందుకు చైనా వెళ్లిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనపర్తి మండలం పెడపర్తి గ్రామానికి చెందిన సత్తి శ్రీనివాసరెడ్డి( 26) షాంగై లోని యాంగోజియా యూనివర్సిటీలో వైద్య విద్య చదువుతున్నాడు. గత డిసెంబర్‌లో ఎంబీబీఎస్‌ను పూర్తిచేసి జనవరి నుంచి హౌస్ సర్జన్ చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో విద్యాభ్యాసం ముగించుకుని డాక్టర్ పట్టాతో స్వగ్రామానికి తిరిగి వస్తాడనుకుంటున్న తరుణంలో ఆయన మరణవార్త ఇంటికి చేరింది. ఈ నెల 16న చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన ట్లు యూనివర్సిటీ ప్రొఫెసర్ లిల్లీ జి.యాంగ్ పెడపర్తిలో ఉంటున్న శ్రీనివాసరెడ్డి అక్క వరలక్ష్మికి మెసేజ్ పంపించారు.
Comments