కడపలో ఒకచోట రీపోలింగ్
హైదరాబాద్,మే 12: కడప లోక్‌సభ స్థానానికి ఈనెల 8న జరిగిన పోలింగ్‌లో నగరంలోని 108వ పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సక్రమంగా పనిచేయని కారణంగా అక్కడ గురువారం నాడు రీపోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో మొత్తం 957 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల తో పాటు కడప, పులివెందుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరుగుతుంది.
Comments