భుజం నొప్పితో ఐపీఎల్ నుంచి వైదొలిగిన సెహ్వాగ్
న్యూఢిల్లీ,మే 10:: భుజం నొప్పిని భరిస్తూనే ఐపీఎల్‌లో కొనసాగుతున్న ఢిల్లీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఎట్టకేలకు వైదొలిగాడు. రోజు రోజుకూ నొప్పి తీవ్రమవుతుండటంతో శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించాడు. దీంతో ఐపీఎల్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లకు సెహ్వాగ్ దూరం కానున్నాడు. వచ్చే నెలలో ఆరంభమయ్యే విండీస్ పర్యటనకూ అందుబాటులో ఉండటం లేదు. సర్జరీ కోసం సెహ్వాగ్ లండన్ వెళ్లనున్నాడు.ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఆసీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఎనిమిది పాయింట్లతో డీడీ ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ అవకాశాలు వీరికి దాదాపుగా లేనట్టే.
Comments