అమెరికాపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి గిలానీ ఆగ్రహం
ఇస్లామాబాద్,మే 9: : అమెరికాపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి గిలానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎస్ఐపై అమెరికా ఆరోపణలను ఆయన ఖండించారు. ఐఎస్ఐ కృషివల్లే లాడెన్ ని కనుక్కోగలిగారన్నారు. ఆల్ ఖైదా తమ గడ్డపై పుట్టలేదన్నారు. ఆల్ ఖైదాని పెంచిపోషించింది అమెరికాయేనని ఆయన విమర్శించారు. అమెరికా ఏకపక్ష దాడులు విచారకరమని ఆయన అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు తమభూభాగాన్ని వాడుకోవడాన్ని తాము సహించ బోమని ఆయన స్పష్టం చేశారు.

Comments