ఉప ఎన్నికలు ప్రశాంతం
హైదరాబాద్,మే 8: కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసాయి. ఉప ఎన్నికల ఓటింగ్ సమయం ముగిసి పోయినప్పటికి పోలింగ్ బూత్‌ల వద్ద్ద క్యూలో భారీగా వున్న ఓటర్లకు కూడా వోటు వేసేందుకు అనుమతించడంతో చాల చోట్ల పొద్దు పోయేవరకు పోలింగ్ కొనసాగింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ 81 శాతం నమోదు కాగా, కడప లోకసభ నియోజకవర్గంలో 69.5 శాతం నమోదైంది. పులివెందులలో మూడు శాతం ఓటింగ్ పెరిగింది. కడపలో సాంకేతిక లోపం తలెత్తడంతో 108 పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు.
Comments