ఎయిరిండియా పైలట్ల సమ్మె విరమణ
న్యూఢిల్లీ,మే 7: ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలంకావడంతో గత పదిరోజులుగా కొనసాగిస్తున్న సమ్మెను ఎయిర్ ఇండియా పైలట్లు విరమించారు. తొలగించిన పైలట్లను విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సుధీర్ఘ చర్చల అనంతరం పైలట్లకు, అధికారులకు మధ్య అవగాహన కుదిరింది. ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ)కు గుర్తింపునివ్వనున్నట్టు అధికారులు తెలిపారు.
Comments