సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 81.71 శాతం ఉత్తీర్ణత
న్యూఢిల్లీ,మే 24: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పన్నెండో తరగతి ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో 81.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 1.84 శాతం పెరిగిందని, బాలికలే ఈసారి ముందంజలో నిలిచారని తెలిపాయి. బాలికల ఉత్తీర్ణతా శాతం 86.93 కాగా బాలుర ఉత్తీర్ణతా శాతం 77.83 శాతం గానమోదైంది. ఈ ఏడాది మొత్తం 7,70,043 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
Comments