‘నందీశ్వరుడు' గా నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్: ‘సింహా’ విజయం సాధించిన ఉత్సాహంలో వరుసగా సినిమాలు చేస్తున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యంతో పాటు పరుచూరి మురళి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నారు. కాగా ఈ నందమూరి నటసింహం త్వరలో నటించనున్న మరో చిత్రం ‘నందీశ్వరుడు’. బాలయ్య సంచలన విజయాల్లో ఒకటైన నరసింహానాయుడుతో పాటు మరో ప్లాప్ చిత్రం సీమసింహానికి కథను అందించిన చిన్నికృష్ణ కథను అందిస్తున్న ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకుడు. ఇంతకు ముందు బాలయ్యతో సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించిన బి గోపాల్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనే ఆలోచనలో వున్నారట. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తారని తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర పూర్తి వైవిద్యంగా పవర్ ఫుల్ గా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా.

Comments