సత్యసాయి సమాధికి ఏర్పాట్లు
పుట్టపర్తి ,ఏప్రిల్ 26: బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల సమయంలో సత్యసాయి అంత్యక్రియలు జరగనున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ జనార్థన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల్లోగా క్యూలైన్లలో ఉన్న భక్తులందరికీ దర్శనానికి అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు. బుధవారం మధ్యాహ్నాం 12 గంటల తర్వాత బాబా మహా సమాధి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కాగా, సత్య సాయిబాబా పార్ధివ దేహాన్ని కుల్వంత్ హాల్‌లోనే ఖననం చేయాలని ట్రస్టు సభ్యులు నిర్ణయానికి వచ్చారు. అక్కడ బాబా పాలరాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా, వద్దా అనే విషయంపై ట్రస్టు సభ్యులు ఓ నిర్ణయానికి రాలేదు. దీనిపై తదనంతరం నిర్ణయం తీసుకుంటారు.

Comments