ఢిల్లీ డేర్‌డెవిల్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం
జైపూర్,ఏప్రిల్ 12: ఐపీఎల్-4లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ పై 6 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. వార్నర్ (54) వేణుగోపాలరావు (60) అర్థ సెంచరీలతో రాణించారు.
Comments