తెలంగాణ కోసం కేసీఆర్ చండీయాగం
హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దంపతులు చండీయాగం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ ఫాంహౌస్‌లో గురువారం ఉదయం కేసీఆర్ దంపతులతో వేద పండితులు చండీయాగాన్ని ఆరంభించారు. 65మంది వేద పండితులు మూడు రోజుల పాటు ఈ యాగాన్ని జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్మేలు, ఎంపీ విజయశాంతి, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.
Comments