డెక్కన్ పై కోల్‌కతా విజయం
కోల్‌కతా,ఏప్రిల్ 12: ఐపీఎల్-4లో భాగంగా ఇక్కడ ఛార్జర్స్ తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 9 పరుగుల తేడాతో తొలి విజయం నమోదు చేసింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో డెక్కన్ ఆటగాళ్లు విఫలమయ్యారు.154 పరుగులకే అవుటై రెండో ఓటమి నమోదు చేశారు. కోల్‌కతా బౌలర్లలో అబ్దుల్లా మూడు వికెట్లు తీయగా, భాటియా , ఉనాద్కత్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న కోల్‌కతా బ్యాట్‌మెన్‌లలో ఓపెనర్ కల్లీస్ 53 పరుగులతో బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడగా, బిస్లా 19, కెప్టెన్ గంభీర్ 29, యూసఫ్ పఠాన్ 22,తివారీ 30 పరుగులు చేశారు.
Comments