న్యూజిలాండ్‌లో భూకంపం
వెల్లింగ్టన్,ఏప్రిల్ 18: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదైంది. న్యూజిలాండ్ ఈశాన్య తీరంలోని తూర్పు అక్లాండ్‌లో భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. పసిఫిక్ సునామీ వార్మింగ్ సెంటర్ సునామీ హెచ్చరికల్ని జారీ చేసింది. అయితే ఇప్పటికిప్పుడే ముప్పేమి లేదని తెలిపింది.
Comments