పూణే వారియర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
ముంబై: ఐపీఎల్ టోర్నిలో భాగంగా పూణే వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. 140 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు ఇంకా మూడు బంతులు ఉండగానే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ విజయంతో ర్యాంక్‌ల పట్టికలో చెన్నై జట్టు రెండవస్థానానికి చేరుకుంది. చెన్నై జట్టులో అత్యధికంగా బద్రినాథ్ 63 పరుగులు చేశారు. బద్రీనాథ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేశారు. రైనా 25 బంతుల్లో 34 పరుగులు, విజయ్ 31 పరుగుల సాధించి చెన్నై జట్టు విజయంలో పాలు పంచుకున్నారు.
Comments