పుణే వారియర్స్ కు మరో ఓటమి
చెన్నై,ఏప్రిల్ 26: ఐపీఎల్-4లో చెన్నైతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పుణే వారియర్స్ 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వారియర్స్ లక్ష్య ఛేదనలో ఏమాత్రం చురుకుదనం కనబరచలేదు . రైడర్ (15), మిశ్రా (9), పాండే (12)లు త్వరగా పెవిలియన్ చేరి అభిమానులను నిరాశ పరిచారు. యువరాజ్ ఒక్కడే పోరాడి 34 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. చెన్నై టీం సమష్టిగా రాణించి విజయ బాపుటా ఎగురవేసింది. చెన్నై బౌలర్లలో మోర్కెల్ మూడు, అశ్విన్ , బొలింగర్ లు తలో రెండు వికెట్లు తీశారు.
Comments