దంపతులైన ప్రేమికులు...
లండన్ , ఏప్రిల్ 29: బ్రిటన్ యువరాజు విలియమ్ తన ప్రియురాలు కేట్ ని వివాహం చేసుకున్నారు. వెస్ట్ మినిస్టర్ ఎబే చర్చిలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక జరిగింది. కేట్ వేలికి ఐరిష్ గార్డ్ యూనిఫామ్ లో ఉన్న విలియం ఉంగరం తొడిగారు. కేట్ తెల్లటి లేస్ గౌను ధరించారు. వీరిద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విలియమ్ కంటే కేట్ ఆరు నెలలు పెద్ద. కేట్ డయానాకు తగిన కోడలని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ వివాహ వేడుకకు దేశవిదేశాల నుంచి 1900 మంది అథిధులు హాజరైయ్యారు. లండన్'లో పండుగ సందడి నెలకొంది. సెంట్రల్ లండన్'ని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. 30 ఏళ్ల తరువాత ఈ రాజ కుటుంబంలో జరిగిన పెళ్లి ఇది. ఈ పెళ్లికి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు అంచనా.

Comments