వర్థమాన సంగీత దర్శకుడు అనిల్ మృతి
హైదరాబాద్,ఏప్రిల్ 22 : వర్థమాన సంగీత దర్శకుడు అనిల్ (33) గుండెపోటుతో మృతి చెందారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం ఉదయం మరణించారు. ‘గమ్యం’, ‘నిన్న నేడు రేపు’, ‘సంభవామి యుగే యుగే’ ‘కళావర్ సింగ్’,‘ఎల్‌బిడబ్ల్యూ’ చిత్రాలకు అనిల్ సంగీతం సమకూర్చారు. అనిల్ స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల.
Comments