న్యూజిల్యాండ్‌లో భారత కమ్యూనిటీ వృద్ధి
హమిల్టన్ ,ఏప్రిల్ 19: న్యూజిల్యాండ్‌లో భారత సంతతి కమ్యూనిటీ వృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం నేపథ్యంలో విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాల కోసం వలసపోయే వారి సంఖ్య భారీగా తగ్గింది. అయితే, ఇందుకు విరుద్ధంగా న్యూజిల్యాండ్ వచ్చే భారతీయుల సంఖ్య గత మూడేళ్లలో గణనీయంగా పెరిగింది. 2009-10వ సంవత్సరానికిగాను 73,400 మంది విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి అర్హత సాధించాగా, ఇందులో భారతీయులే అధికమని, విదేశీ విద్యార్థుల విషయంలో భారత్ ప్రధాన ఆదాయ వనరుగా మారిందని కార్మిక శాఖ వెల్లడించింది. విదేశీ విద్యార్థుల ద్వారా గత ఏడాది న్యూజిల్యాండ్ 2.3 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. భద్రమైన ప్రదేశమనే భావన, కుటుంబ వాతావరణంతో పాటు, ఆతిథ్య రంగం, వ్యాపార రంగాలలో విసృ్తతమైన అవకాశాలుండడంతో భారతీయులు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపుతున్నారని మేనేజ్‌మెంట్ విద్యార్థి గుర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఉన్నత చదువుల కోసం పంజాబ్, గుజరాత్‌ల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారని పేర్కొన్నారు.
Comments