రాయల్స్ పై నైట్ రైడర్స్ మూడో విజయం
కోల్‌కతా,ఏప్రిల్ 18: ఐపిఎల్ నాలుగో అంచెలో కోల్‌కతా నైట్ రైడర్స్ దూసుకు వెడుతోంది. ఆదివారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో సొంత గడ్డపై ఎనిమిది వికెట్లతో ఘన విజయం సాధించింది. వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ఇంతకుముందు నైట్ రైడర్స్ రాయల్స్ వారి సొంతగడ్డ జైపూర్‌లోనూ ఓడించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బాలాజీని వరించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కేవలం 15.2 ఓవర్లలో 81 పరుగులకే చేతులెత్తేసింది. లక్ష్యఛేదనలో కోల్‌కతా 2 వికె ట్లు కోల్పోయి మరో 38 బంతులు మిగిలుండగానే విజయబావుటా ఎగురవేసింది.
Comments