న్యూజెర్సీలో తెలుగు ఎన్నారై హత్య
మహబూబ్ నగర్,ఏప్రిల్ 30: అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు ఎన్నారై ని దుండగులు కాల్చి చంపారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మాదారం గ్రామానికి చెందిన అర్జున్ రెడ్డి ని దుండగులు కాల్చి చంపారు. అర్జున్ రెడ్డి చాలా కాలంగా అమెరికాలో ఉంటున్నారు. ఆయనకు 52 ఏళ్ల వయస్సు. సొంతంగా ఫార్మసీ షాపు నడుపుతున్నారు. కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డికి ఆయన దూరపు బంధువైన అర్జున్ రెడ్డిగత ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి శాసనసభా నియోజకవర్గం టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఓ నెల రోజుల్లో ఆయన స్వస్థలానికి రావాల్సి ఉందని చెబుతున్నారు. నల్లజాతీయులే అర్జున్ రెడ్డిని కాల్చి చంపినట్లు అనుమానిస్తున్నారు.
Comments