త్రీడీ సినిమాగా ‘షోలే ’
ముంబై, ఏప్రిల్ 14: బ్లాక్‌బస్టర్ హిందీ సినిమా ‘షోలే ’ త్రీడీ సినిమాగా రూపొందనుంది. నిర్మాత సుభాష్ ఘాయ్ ఈ చిత్రాన్ని మాయా డిజిటల్ కంపెనీతో కలసి త్రీడీ రూపంలోకి మార్చనున్నారు. దీనికి సంబంధించి కాపీరైట్ చర్చలు జరుగుతున్నాయని ’ ని ఘాయ్ తెలిపారు. అమితాబ్ బచ్చన్, హేమామాలిని తదితరులు నటించిన షోలే (1975) అశేష జనాదరణ పొందడం తెలిసిందే. కాగా, రుతుపర్ణో ఘోష్ దర్శకత్వం వహించిన ‘నైకా దుబి’ బెంగాలీ చిత్రాన్ని ఘాయ్ హిందీలోకి ‘కాష్మాకాశ్’ పేరుతో డబ్ చేశారు. హిందీ వర్షన్ పాటలను మంగళవారం విడుదల చేశారు.
Comments