రాజస్థాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం
జైపూర్,ఏప్రిల్ 15: రాజస్థాన్ రాయల్స్ జట్టుపై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఘనవిజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేసింది. పానికర్ 9 పరుగులు, ద్రావిడ్ 35, మెనారియా 27, వాట్స్ న్ 22 పరుగులు చేశారు. టేలర్ 35 పరుగులు, బోథ్ 12 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. తరువాత నైట్ రైడర్స్ జట్టు 18.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసింది. ఎంఎస్ బిస్లా ఒక్క పరుగు మాత్రమే చేసి రన్ అవుటయ్యాడు. కల్లీస్ 80 పరుగులు, గంభీర్ 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
Comments