అన్నాహజారేకు టాగూర్ శాంతి బహుమతి
న్యూఢిల్లీ,ఏప్రిల్ 10: : అవినీతిపై పోరులో భాగంగా ఆమరణ నిరాహార దీక్షతో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన అన్నా హజారేకు ఈ ఏడాది ‘రవీంద్రనాథ టాగూర్ శాంతి బహుమతి’ని ఇవ్వనున్నట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అవినీతికి వ్యతిరేకంగా అంకితభావంతో అహింసాపూరిత నిరసన చేపట్టి విజయం ధించిన హజారేకే సంఘీభావంగా ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు కింద కోటి నగదు, స్వర్ణ పతకం, ప్రశంసాపత్రం అందజేస్తారు.
Comments