ఉత్తర కరోలినా లో తుపాన్ ధాటికి 23 మంది మృతి
వాషింగ్టన్, ఏప్రిల్ 18: అమెరికాపై తుపాన్లు విరుచుకుపడ్డాయి. వీటి ధాటికి ఆరు రాష్ట్రాల్లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో చెట్లు కూడా కూలిపోయాయి. అత్యవసర సహాయ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఉత్తర కరోలినా లో అధిక నష్టం సంభవించింది. దీంతో ఉత్తర కరోలినా ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఉత్తర కరోలినాలో 23 మంది, వర్జీనియాలో నలుగురు, అలమాబాలో ఏడుగురు మృతిచెందారు. మరోవైపు వర్జీనియాలో వచ్చిన తుపాను తీవ్రతకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
Comments