మార్చిలో వరుణ్‌సందేశ్ కొత్త చిత్రం
హైదరాబాద్: 'కుదిరితే కప్పు కాఫీ' తర్వాత వరుణ్‌సందేశ్ కథానాయకుడిగా మరో లవ్ స్టోరీ రాబోతోంది. యుకె ఎవెన్యూస్ ప్రెవేట్ లిమిటెడ్ పతాకంపై పి.ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ దర్శకుడు. బాలీవుడ్ తార అమృతరావు (‘అతిథి ఫేం) ’ సోదరి ప్రీతికారావు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ‘‘అందమైన ప్రేమకథగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తున్నామని, . వినోదాత్మకంగా సాగే ఈ క్యూట్ లవ్‌స్టోరీ చిత్రీకరణ మార్చిలో ప్రారంభిస్తామని తెలిపారు. కోట శ్రీనివాసరావు, నాజర్, అలీ, వేణుమాధవ్, కాశీ విశ్వనాథ్, ‘వెన్నెల’ కిషోర్, రణధీర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి కెమెరా: మల్హార్ భట్, సంగీతం: మోహన్‌జోన్, ఆర్ట్: రామ్, సమర్పణ: శ్రీమతి పి.లక్ష్మి.


Comments