రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర బిజెపి నేత వనం ఝాన్సీ మృతి
హైదరాబాద్,ఫిబ్రవరి 19: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, బిజెపి అధికార ప్రతినిధి వనం ఝాన్సీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ మండలం లోని ఓ గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టా కార్యక్రమానికి ఆమె వెళ్లారు. రాత్రి కావటంతో అచ్చంపేటలో రాత్రి బస చేశారు. ఆ తర్వాత ఉదయాన్నే హైదరాబాద్‌కు తిరుగు కారులో ప్రయాణం అయ్యారు. ఆమన్‌గల్ మండలం కడ్తాల్ వద్దకు వచ్చిన తర్వాత వెనుక నుండి వచ్చిన ఇన్నోవా కారు ఝాన్సీ ఉన్న కారును ఢీకొట్టింది. తీవ్రం గా గాయపడిన ఆమెను వెంటనే హైదరాబాద్ డిఆర్‌డీవోలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో మరణించారు. కారులో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరొకరు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వనం ఝాన్సీ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా, అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Comments