వారం పాటు హరీష్ సహా ఐదుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్,ఫిబ్రవరి 18: బడ్జెట్ సమావేశాల తొలిరోజున గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో అనుచితంగా ప్రవర్తించిన ఐదుగురు సభ్యులను ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ ఏడురోజులపాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, విద్యాసాగర్‌రావు, సమ్మయ్య ఉండగా, టిడిపి నుండి రేవంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి ఉన్నారు. రూల్ నెంబర్ 17ఏ కింద దౌర్జన్యంగా వ్యవహరించినందుకు వీరిపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కాగా సస్పెన్షన్ అనంతరం సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
Comments