ప్రపంచకప్ :కెన్యాపై న్యూజిలాండ్ ఘనవిజయం
చెన్నై,ఫిబ్రవరి 20: ప్రపంచకప్ రెండో వన్డే మ్యాచ్‌లో కెన్యాపై పది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఎలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెన్యా చిత్తుగా ఓడిపోయింది. కెన్యా నిర్ధేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 8 ఓవర్లలోనే చేధించి సునాయాసంగా విజయం సాధించింది. కివీస్ ఓపెనర్లు గుప్తిల్, మెక్ కల్లమ్‌లు అలవోకగా జట్టును గెలిపించారు. వీరిలో 32 బంతులాడిన గుప్తిల్ 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు సాధించగా, మెక్ కల్లమ్ 17 బంతుల్లో నాలుగు ఫోర్లతో 26 పరుగులు సాధించాడు. తద్వారా కివీస్ 8 ఓవర్లలో వికెట్ లేమితో 72 పరుగులతో ఘన సాధించింది. ఫలితంగా రెండున్నర గంటలోపే వన్డే ప్రపంచకప్ రెండో మ్యాచ్ ముగిసింది.
Comments