కెన్యాపై పాకిస్తాన్ గెలుపు
హంబన్‌టోటా:ఫిబ్రవరి 23: వరల్డ్ కప్ మ్యాచ్ లో కెన్యాపై 205 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. కెన్యా జట్టులో నలుగురు ఆటగాళ్లు ఖాతా తెరువకుండానే పెవిలియన్ దారి పట్టారు. ఒబుయా ఒక్కడే రాణించి 47 పరుగులు చేశాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 317 పరుగులు చేసింది. పాక్ జట్టులో కమ్రాన్ అక్మల్ 55, యూనిస్ ఖాన్ 50, మిస్బావుల్ హక్ 65, ఉమర్ అక్మల్ 71 పరుగులు చేశారు.
Comments