విండీస్‌పై దక్షిణాఫ్రికా విజయం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టీండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ ల తేడాతో విజయం సాధించి0ది. డివిలియర్స్ (107) పరుగుల అజేయ సెంచరీతో జట్టు ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 223 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు ఆదిలో వికెట్లు కోల్పోయినప్పటకీ తర్వాత విజయబాట లో నడిచారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 47.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటయింది. డీఎమ్ బ్రేవో 73, డీఎస్ స్మిత్ 36, చంద్రర్‌పాల్ 31, డీజే బ్రోవో 40, థామస్ 15 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 4, స్టెయిన్ 3, బోథా 2 వికెట్లు తీశారు.
Comments