గోద్రా అల్లర్ల కేసులో 31మంది దోషులుగా నిర్థారణ
అహ్మదాబాద్ ,ఫిబ్రవరి 22 : గోద్రా అల్లర్ల కేసులో 31మందిని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా గుర్తించింది. దోషులకు శిక్ష కాలాన్ని ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 25న ప్రకటించనుంది. నేరారోపణలు రుజువు కానందున మరో 63మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరిలో 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ను తగులబెట్టిన ఘటనలో 69మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 80మంది నిందితులు జైల్లోనే ఉన్నారు. కేసు విచారణ నిమిత్తం ప్రత్యేక న్యాయస్థానం 250మందిని విచారించింది.
Comments