రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.1,28,542 కోట్లు
హైదరాబాద్,ఫిబ్రవరి 23: 2011-2012 ఆర్థిక సంవత్సరానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షా 28వేల 542 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి శాసనసభలో ప్రవేశ పెట్తారు. బడ్జెట్ లో ప్రణాళికేతర కేటాయింపులు - 80,984 కోట్లు, - ప్రణాళికా వ్యయం - 47,558, - పన్నేతర ఆదాయం - 12,339 కోట్లు,- పన్ను వసూళ్లు - 56,438 కోట్లు, రెవిన్యూ మిగులు 3,826 కోట్లు గా చూపించారు. ద్రవ్యలోటు - 17,602 కోట్లుగా అంచనా వేశారు. ఉపాధి హామీ పథకం పని దినాలను 100 రోజులనుండి 125 రోజులకు పెంచుతున్నట్లు, ఆహార భద్రతకు అధిక ప్రాదాన్యం ఇస్తున్నట్లు, 2 రూపాయల కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్టు మంత్రి చెప్పారు. బడ్జెట్ లో - జలయజ్జానికి - 15,010 కోట్లు, - రహదారులు భవనాలకు - 4,108 కోట్లు, - ఇంధన శాఖకు - 4,980 కోట్లు, - పాఠశాలలకు - 14,025 కోట్లు, - ఉన్నత విద్యకు - 3,337 కోట్లు, - గిరిజన సంక్షేమానికి - 1,230కోట్లు, - మైనారిటి సంక్షేమానికి - 3,001కోట్లు, - సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు - 100 కోట్లు, - సంక్షేమ కార్యక్రమాల కోసం - 400 కోట్లు, - ఉపాధి హామీకి - 600 కోట్లు, - పాడి పరిశ్రమకు - 931 కోట్లు, - వైద్య-, ఆరోగ్య శాఖకు - 5,040 కోట్లు, - మౌలిక వసతులకు - 143 కోట్లు, - రూ.2కిలోల బియ్యానికి - 2,500 కోట్లు, - పట్టణాబివృద్ధికి - 5,080 కోట్లు, - యువజన సంక్షేమానికి - 58.95 కోట్లు, - గ్రామీణాభివృద్ధికి - 3,341 కోట్లు, - గ్రామీణ నీటి సరఫరా - 773 కోట్లు, - స్త్రీ, శిశు సంక్షేమం - 1498 కోట్లు, - ఐటికి - 51 కోట్లు, - విద్యుత్ శాఖకు - 4,980కోట్లు, పశు సంవర్ధకానికి - 931 కోట్లు, ఇంధనానికి - 4,980 కోట్లు, నియోజక వర్గ అభివృద్ధికి - 385 కోట్లు, - పారిశ్రామిక రంగానికి - 858 కోట్లు, సాంఘీక సంక్షేమం - 2352 కోట్లు, - గ్రామీణ రోడ్లు - 627 కోట్లు, పాడి పరిశ్రమకు - 930 కోట్లు, పౌరసరఫరాలకు - 2500 కోట్లు, గృహనిర్మాణానికి - 2300 కోట్లు,ఆర్టీసికి - 200 కోట్లు, మహిళా సంక్షేమానికి - 1,948 కోట్లు, ఇంధన శాఖకు 4980 కోట్లు కేటాయించారు.

Comments