తెలంగాణ పై మార్చి 1 తర్వాత అమీతుమీ: కేసీఆర్
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24: తెలంగాణ అంశంపై మార్చి 1వ తేదీ తర్వాత తాడో పేడో తేల్చుకుంటామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. లోక్‌సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణపై కేంద్రం స్పందించేలా కనిపించటం లేదన్నారు. 600మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్రం నుంచి కనీస స్పందన కరువైందన్నారు. రైల్వే, వార్షిక బడ్జెట్‌లను టీఆర్‌ఎస్ బాయ్‌కాట్ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణపై చర్చించాలంటూ సభలో తమకు మద్దతు తెలిపిన ఎన్డీయే సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, టీఆర్‌ఎస్ రెండోరోజు కూడా లోక్‌సభలో తెలంగాణ అంశంపై చర్చకు పట్టు బట్టింది. దీంతో సభా కార్యాక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ మీరాకుమార్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.
Comments