ఈజిప్టు నుంచి స్వదేశానికి భారతీయులు
ముంబై:,జనవరి 31 : ఈజిప్టు నుంచి 300 మంది భారతీయులతో బయలుదేరిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం సోమవారం మధ్యాహ్నం ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. ఈజిప్టు దేశాధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో అల్లర్లు చెలరేగాయి. దీంతో ఈజిప్టులో నివసిస్తున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రత్యేక విమానం ద్వారా ముందుగా 300 మందిని ఇక్కడకు తరలించింది.
Comments