వన్డే సిరీస్ అసీస్ కైవశం
బ్రిస్బేన్ ,జనవరి 30: ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా గెలిచింది. ఇక్కడ జరిగిన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 45.3 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఇరుజట్ల మధ్య ఆరో వన్డే బుధవారం సిడ్నీలో జరుగుతుంది.
Comments