రిపబ్లిక్ డే పోలీస్ పతకాలు
హైదరాబాద్,,జనవరి 25: రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డికి రాష్టపతి పోలీస్ పతకం (పీపీఎం) దక్కింది. పోలీసుశాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతకాలను ప్రకటించింది. ఉన్నతమైన రాష్టప్రతి పోలీస్ పతకానికి రాష్ట్ర పోలీసుశాఖ నుంచి మహేందర్‌రెడ్డితోపా టు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఎస్పీ చింతా రాంచందర్ ఎంపికయ్యారు. మరో 19 మంది ఇండియన్ పో లీస్ మెడల్ (ఐపీఎం), మరో ముగ్గురు పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) పొందారు.
Comments