టెన్నిస్‌కు మళ్లీ గుడ్‌బై చె ప్పిన హెనిన్
బ్రస్సెల్స్, జనవరి 26: బెల్జియం స్టార్ ప్లేయర్, మాజీ నెంబర్‌వన్ జస్టిన్ హెనిన్ అంతర్జాతీయ టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మోచేయి గాయం తిరగబెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె వివరించింది. ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించిన 28 ఏళ్ల హెనిన్ 2008 మే నెలలో తొలిసారి రిటైర్‌మెంట్ ప్రకటించింది. అయితే సహచరిణి కిమ్ క్లియ్‌స్టర్స్ పునరాగమనం చేసి యూఎస్ ఓపెన్ సాధించడంతో హెనిన్ ఆమెను స్ఫూర్తిగా తీసుకుంది. తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకొని గత ఏడాది జనవరిలో మళ్లీ రాకెట్ పట్టింది. అయితే క్లియ్‌స్టార్స్ స్థాయిలో రాణించకపోవడం... మోచేయి గాయం తిరగబెట్టడంతో ఏడాది తిరిగేలోపే హెనిన్ ఈసారి శాశ్వతంగా టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది.
Comments