ఈజిప్ట్ లో అశాంతి
కైరో,జనవరి 28: రాజకీయ, ఆర్ధిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ, ఈజిప్ట్ లో నిరసనలు వెల్లువెత్తాయి. కైరో, అలెగ్జాండ్రియా, సూయెజ్ మొదలైన చోట్ల ప్రదర్శకులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఆందోళన వల్ల ఇంటర్నెట్,మొబైల్ సర్వీసులకు అంతరాయం కలిగింది. అశాంతిని అణచివేయడానికి ప్రభుత్వం సుమారు 900 మందిని అరెస్ట్ చేసింది.

Comments