తెలంగాణపై సంప్రదింపులు 'సాగు'తాయి:షకీల్ అహ్మద్
న్యూఢిల్లీ ,జనవరి 27: తెలంగాణపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే కాంగ్రెస్ స్పందిస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్ మూడు, నాలుగు దశాబ్దాల నుంచి ఉందని దీనికి ఇప్పటికిప్పుడే పరిష్కారం ఎలా దొరుకుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై సంప్రదింపుల ప్రకియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసమ్మతి గురించి తనకు తెలియదని మరో ప్రశ్నకు సమాధానంగా షకీల్ అహ్మద్ చెప్పారు.
Comments