అమెరికాలో ఆంథ్ర యువకుని మృతి
డల్లాస్,జనవరి 19: అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తెలుగు యువకుడు తాళ్లూరి శ్రీనివాస్ (38) అనారోగ్యంతో సోమవారం మరణించాడు. ఫోర్లిడాలోని తంపాలో అతడు కన్నుమూసినట్టు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలిపింది. న్యూమోనియా కారణంగా అతడు అనారోగ్యానికి గురయిన ట్టు ఫ్లోరిడాలోని జిఫర్‌హిల్స్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. గుంటూరు పట్టణంలోని ఆరండల్‌పేటకు చెందిన శ్రీనివాస్ ఎమ్‌సీఏ పూర్తి చేసిన తర్వాత 8 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చాడు. ఆస్టిన్‌లోని చార్లెస్ షావాబ్ ఫెనాన్షియల్ కంపెనీలో అతడు పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌కు భార్య ప్రసన్న (32), కొడుకు తేజ(12), కూతురు స్నేహ(9) ఉన్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వగ్రా మం తరలించేందుకు తానా ఏర్పాట్లు చేస్తోంది.
Comments