తిరుమల ప్రసాదాల ధరల పెంపు
హైదరాబాద్,జనవరి 28: తిరుమల స్వామి వారి ప్రసాదాల ధరలను టీటీడీ భారీగా పెంచింది.. రూ.25 ఉన్న జిలేబీ ప్రసాదాన్ని రూ.70కి, వడ ప్రసాదాన్ని రూ.4 నుంచి రూ.25కు, మురుకు ప్రసాదాన్ని రూ.4 నుంచి 30 రూపాయలకు పెంచింది. ప్రసాదాల ధరల పెంపులో ఒక్క లడ్డూకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ముడి సరుకుల ధరలు పెరిగినందువల్లే ధరల పెంచినట్లు టీటీడీ తెలిపింది.
Comments